ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నాడు రాజకీయ శిక్షణా కేంద్రంగా ఉన్న గండిపేట ప్రాంగణం, నేడు భావితరాలను తీర్చిదిద్దే విద్యా దేవాలయంగా మారడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యే అసలైన …
Read More »culture
డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక జీవన సాఫల్య పురస్కార ప్రధానము
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: “పద్మశ్రీ” పురస్కార గ్రహీత – బృహత్ ద్విసహస్రావధాని – మహాకవి – బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మకు దర్శనం పత్రిక 21వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో చేసిన “గురుసత్కారం” కార్యక్రమంలో “జీవన సాఫల్య పురస్కార ప్రదానం ” కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ కేంద్ర గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ …
Read More »ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారానికి ఎంపిక
పర్లాకిమిడి,ఐఏషియ న్యూస్: గజపతి జిల్లాకు చెందిన ఆదివాసి విద్యార్థిని జ్యోత్స్న సబరో జాతీయ బాలల పురస్కారానికి ఎంపిక అయ్యారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మునీంద్ర తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజపతి జిల్లా రాయగడ సమితి పేకెట్ గ్రామానికి చెందిన జ్యోత్స్న సబరో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు క్రీడా పోటీల్లో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. ఈనెల 26న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో జరగబోయే ఒక …
Read More »107 సంవత్సరాల చరిత్ర గల కోడిగుడ్డు మేడ
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: తెనాలి ప్రాంతంలో కోడిగుడ్డు మేడంటే తెలియనివారుండరు. 107 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనం రాజసానికి ఠీవిగా నిలుస్తోంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 1918లో పారేపల్లి పెదరావమ్మ తన తమ్ముడు పచ్చిపులుసు రాంపుల్లయ్య పేరిట నిర్మించారు.రాజమహల్లా ఉండాలన్న ఆలోచనతో మద్రాస్ నుంచి కార్మికులు, నిపుణులను రప్పించారని, సున్నం, కోడిగుడ్డు సొన, సహజ రంగులను ఇక్కడే గానుగ ఆడించి దానినే సిమెంటుగా వినియోగించారని, విశ్రాంత ఉపాధ్యాయుడు పారేపల్లి భార్గవరామదుర్గాప్రసాద్ వివరించారు. రెండు అంతస్తుల ఈ భవనంలో 12 గదులున్నాయి. ప్రధాన …
Read More »జనవరి 1 న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: క్షణాలు,నిమిషాలు, గంటలు,రోజులు,వారాలు,నెలలు,సంవత్సరాలు.. ఇలా కాలం గిర్రున తిరుగుతోంది. ఠక్కున క్యాలెండర్ మారిపోతోంది. మరీ క్యాలెండర్ కథేంటి? జనవరి 1వ తారీఖునే కొత్త సంవత్సరం అని సంబరాలు చేసుకుంటారు ఎందుకు? అసలు సంవత్సరాన్ని లెక్కించడానికి ప్రమాణం ఏంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతుంటాయి కదూ.అయితే ఈ క్యాలెండర్ కహాని తెలియాలంటే కొన్ని దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. కాలం వేసిన బలమైన ముద్రలను లోతుగా పరిశీలించాల్సిందే. ప్రపంచానికి జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం …
Read More »పెళ్లికి వచ్చిన వారికి హెల్మెట్లు బహుమతి
రాజస్థాన్,ఐఏషియ న్యూస్: రాజస్థాన్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడి కుచామన్ నగరంలో మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కూతురు సోనును యశ్ బెద్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్ గిఫ్టులుగా హెల్మెట్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ 286 హెల్మెట్లను అందజేయడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News