కాకినాడ రూరల్,ఐఏషియ న్యూస్: కాకినాడ రమణయ్యపేటలో గల మూడవ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకోనునట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కృష్ణకుమార్ తెలిపారు.గురువారం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు స్కూలుకు కావలసిన కంప్యూటర్లు మౌలిక సదుపాయాలపై చర్చించారని ఉద్దేశంతో ఇప్పుడు 13 కంప్యూటర్లలో అందజేయడం జరిగిందని మరో 17 కంప్యూటర్లు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా …
Read More »Education
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: జాతీయ హైవేపై ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ క్యూఆర్ కోడ్‌లో సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నంబర్, హైవే ఛైనేజ్, ప్రాజెక్ట్ పొడువు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజినీర్ల నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033, పెట్రోల్ బంక్, ఆస్పత్రుల వివరాలు ఉంటాయి. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీ విద్యార్థుల కోసం 40 లక్షల నోటుబుక్స్,పెన్నులు
విరాళం ఇచ్చిన కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌కు చెందిన కంపెనీ భారీ విరాళం ఇచ్చింది. ఏపీ విద్యార్థులకు అమలవుతున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి.. కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థ ఈ విరాళం ఇచ్చింది. దాదాపు రూ.40 లక్షల రూపాయల విలువైన లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వీటిని పంచుతారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఈ పుస్తకాలు, పెన్‌లు ఉన్న ట్రక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ …
Read More »డీఎస్సీ కి ఎంపికయిన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీహరి
గుడివాడ,ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లాకి చెందిన బంకురు శ్రీహరి గత 5ఏళ్ళుగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పట్టుదలతో చదువుకుని ఒక వైపు విధులు నిర్వహిస్తూ మరొక వైపు డీఎస్సీ కోసం కస్టపడి చదివి వచ్చిన ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఎస్ జి టి పోస్ట్ కు అర్హత సాధించటం జరిగింది. దీనిపై పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు..మరియు గుడివాడ తాలూకా ఎస్ఐ నంబూరి చంటి …
Read More »బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు
కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది 44 ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు పగబట్టిన పేదరికంతో పోరాటం చేసాడు పట్టుబట్టి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, …
Read More »టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక
ములుగు,ఐఏషియ న్యూస్: పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar
Read More »పనిచేయకపోతే తొలగిస్తాం: ఎఫ్ఆర్టీఐ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్
నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో పని చేయని వారిని పదవుల నుంచి తొలగిస్తామని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్ స్పష్టం చేశారు.జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ సూచనల మేరకు ఎఫ్ఆర్టీఐ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా పని చేస్తామని పదవులు తీసుకొని పని చేయని వారు పదవులలో నుండి వైదొలగి కార్యకర్తగా కొనసాగవచ్చన్నారు.సీనియర్ నేత నెల్లూరుకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లా శ్రీవాసరావు, బాపట్లకు చెందిన శామ్యూల్ జాన్సన్ నాయకత్వం నుంచి తప్పుకొని సాదారణ కార్యకర్తగా స్వచ్ఛందంగా …
Read More »అంగన్వాడి,ఆశ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు: ప్రభుత్వం నిర్ణయం
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు.ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.కాగా ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో తల్లికి …
Read More »నేడు వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’
పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం తాడేపల్లి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’ చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వెల్లడించింది. ఆ రోజున ఆయా కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలియజేసింది. శాంతియుతంగా ఈ …
Read More »అధ్యయన యాత్రకు జీవీఎంసీ కార్పొరేటర్లు పయనం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, పలువురు అధికారులు అధ్యయన యాత్రకు మంగళవారం విశాఖ నుండి బయలుదేరి వెళ్లడం జరిగిందని జీవీఎంసీ కార్యదర్శి బి.వి. రమణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు 82 మందికార్పొరేటర్లు, పలువురు అధికారులుమంగళవారంవిశాఖవిమానాశ్రయం నుండిఅధ్యయనయాత్రకుబయలుదేరారని, వీరిలో 43 మంది మహిళా కార్పొరేటర్లు అధ్యయన యాత్రలో వున్నారన్నారు. కార్పొరేటర్ల బృందం 16వ తేదిన విశాఖపట్నంలో బయలు దేరి 24వ తేదీ వరకు జైపూర్, జోధపూర్, జై సల్మార్, ఢిల్లీ ప్రాంతాలలోని మున్సిపల్ …
Read More »