అమరావతి,ఐఏషియ న్యూస్: కేంద్రం తాజాగా జీఎస్టీ స్లాబ్ రేట్లలో చేసిన మార్పుల్ని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో జీఎస్టీ-2.0 సంస్కరణల్ని స్వాగతిస్తూ దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజలకు, దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణలు తెచ్చిన ప్రధానికి ఏపీ అసెంబ్లీ ధన్యవాదాలు తెలిపింది. జీఎస్టీ-2.0 రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ …
Read More »Politics
378 రక్తదాన శిబిరాల్లో 56,265 యూనిట్ల రక్తం సేకరణ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా గుజరాత్ లో ప్రపంచ రికార్డు అహ్మదాబాద్,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి బుధవారం అడుగుపెట్టారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ఏబిటి వైపి) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ ‘నమో కే నామ్ రక్తదాన్’ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు …
Read More »పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్,ఆర్మీ చీఫ్ మార్షల్ అసిమ్ మునీర్ ట్రంప్ తో భేటీ
25న న్యూయార్క్ లో ప్రత్యేక సమావేశం న్యూయార్క్,ఐఏషియ న్యూస్: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే భారత్- అమెరికా మధ్య కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది అమెరికా. ఈ టారిఫ్ లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికా, పాకిస్థాన్ దగ్గరవుతున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మార్షల్ …
Read More »కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘనస్వాగతం
విశాఖపట్నం, ,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,మాజీ రాజ్యసభ …
Read More »నేడు లండన్ లో మంత్రి నారా లోకేష్ రోడ్ షో
నవంబర్ లో పార్టనర్ షిప్ సమ్మిట్ విజయవంతమే లక్ష్యం అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపి ప్రభుత్వం విశాఖలో నవంబర్ 14 15తేదీలల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రి లండన్ లో హైప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా రాత్రి 7గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30గంటలకు) నిర్వహించే ఈ రోడ్ …
Read More »కేఈ కృష్ణమూర్తిని వరించనున్న గవర్నర్ పదవి?
రాజ్యసభకు యనమల.. టిడిపికి దక్కనున్న మరో కేంద్ర మంత్రి పదవి (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: మిత్రపక్షం టీడీపీకి బీజేపీ నాయకత్వం మరో ఆఫర్ ఇచ్చింది. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు …
Read More »నేడు విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు
స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, జీసీసీ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 11.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆంధ్రా యూనివర్శిటీలోని సాగరికా ఫంక్షన్ హాల్లో హెల్త్ క్యాంపులను సీఎం సందర్శించనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువలుగా ప్రారంభించే స్వస్థ్ నారీ-సశక్త్ …
Read More »అధ్యయన యాత్రకు జీవీఎంసీ కార్పొరేటర్లు పయనం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, పలువురు అధికారులు అధ్యయన యాత్రకు మంగళవారం విశాఖ నుండి బయలుదేరి వెళ్లడం జరిగిందని జీవీఎంసీ కార్యదర్శి బి.వి. రమణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు 82 మందికార్పొరేటర్లు, పలువురు అధికారులుమంగళవారంవిశాఖవిమానాశ్రయం నుండిఅధ్యయనయాత్రకుబయలుదేరారని, వీరిలో 43 మంది మహిళా కార్పొరేటర్లు అధ్యయన యాత్రలో వున్నారన్నారు. కార్పొరేటర్ల బృందం 16వ తేదిన విశాఖపట్నంలో బయలు దేరి 24వ తేదీ వరకు జైపూర్, జోధపూర్, జై సల్మార్, ఢిల్లీ ప్రాంతాలలోని మున్సిపల్ …
Read More »19న వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం
అమరావతి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కేంద్ర కమిటీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మ్యాంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 …
Read More »