విశాఖపట్నం, ,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు స్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. విమానంలో మంగళవారం రాత్రి ఆమె విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. ఎన్. మాధవ్, విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఇతర నేతలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గం ద్వారా స్థానిక ర్యాడిసన్ బ్లూ రిసార్ట్ కు చేరుకున్నారు. బుధవారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
Check Also
మాజీ సీఎం జగన్ కు మహిళలు ఘన స్వాగతం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు కాకాని నగర్ వద్ద మాజీ సీఎం వైయస్ జగన్ ఘన స్వాగతం …