రాజస్థాన్ ,ఐఏషియ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత,లోక్‌సభ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడి వివాహం నిశ్చయమైంది. ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రేహాన్ వాద్రా(25)కు అతని గర్ల్‌ఫ్రెండ్ అవీవా బేగ్(23)తో నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రణ్‌థంబోర్‌లో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమంలో ఈ వేడుక జరిగినట్టు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం రేహాన్, అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో రేహాన్ ఇటీవల చేసిన పెళ్లి ప్రతిపాదనకు అవీవా అంగీకారం తెలిపారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News