ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి బిగ్ షాక్

  • కాంప్లిమెంట్ ప్రమాద భీమా ఎత్తివేత

బిజినెస్ డెస్క్,ఐఏసియన్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి అలర్ట్. ఈనెల 15 నుంచి ఎంపిక చేసిన కార్డుల విషయంలో ఎస్‌బీఐ కీలక మార్పులను అమలు చేయనుంది.ఈ కొత్త నిబంధనలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల విధానంపై ఎఫెక్ట్ చూపనున్నాయి.అంతేకాకుండా క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొన్ని ప్రయోజనాల్లోనూ కోత పడనుందని తెలుస్తోంది.
మారనున్న కనీస చెల్లింపు మొత్తం
క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆలస్య రుసుమును తప్పించుకోవడానికి బిల్లులో కొంత మొత్తాన్ని (కనీస చెల్లింపు మొత్తం లేదా మినిమమ్ అమౌంట్ డ్యూ) చెల్లిస్తుంటారు. అయితే ఈనెల15 నుంచి ఈ కనీస మొత్తాన్ని లెక్కించే విధానం మారనుంది.కొత్త విధానం ప్రకారం కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కించేటప్పుడు,జీఎస్‌టీ,ఈఎంఐ, ఫీజులు, ఇతర ఛార్జీలతో పాటు, మిగతా ఔట్‌స్టాండింగ్‌పై 2 శాతాన్ని అదనంగా కలపనున్నారు.దాంతో అదనపు భారం పడటమే కాకుండా ఒకవేళ అలా చేయకపోతే బకాయిలు పెరిగి,అదనంగా వడ్డీ భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా కార్డు వినియోగదారులు చేసే చెల్లింపులను సర్దుబాటు చేసే విధానం కూడా మారనుందని స్పష్టం చేస్తున్నారు. ఇక నుంచి చేసే ఏ చెల్లింపులైనా, మొదట జీఎస్‌టీ కింద తీసుకుంటారు. ఆ తర్వాత ఈఎంఐ, అనంతరం ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కింద సర్దుబాటు చేయనున్నట్టు ప్రకటించారు. చివర్లో మాత్రమే రిటైల్ షాపింగ్ కోసం చేసిన ఖర్చులు లేదా నగదు విత్‌డ్రా చేసుకున్న మొత్తానికి తీసుకుంటారని వివరించారు.
ప్రమాద బీమా ఎత్తివేత
మరోవైపు ఎస్‌బీఐలో ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందించే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కార్డులపై ఈ బీమా రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండగా వారు దీన్ని కోల్పోనున్నారు.అదేవిధంగా మరికొన్ని బ్యాంకులు కూడా ప్రమాద బీమాను ఎత్తివేయడం జరిగింది. సదుపాయాన్ని ఎత్తివేస్తున్న కార్డుల జాబితాలోయూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్,పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్,కేవీబీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్,కేవీబీ ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్,అలహాబాద్ బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్,యూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్,పీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్,సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్,కర్ణాటక బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ వంటివి ఉన్నాయి.

User Rating: Be the first one !

About admin

Check Also

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *