విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరగనుంది. పెట్టుబడిదారుల సదస్సు కోసం ఒకరోజు ముందుగా విశాఖకు వస్తున్న మంత్రి లోకేశ్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ఎండాడలో పనోరమ హిల్స్ వెనుక 10ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News