మున్సిపాలిటీలలో బిల్డింగ్ క్రమబద్ధీకరణ బిపిఎస్ స్కీమ్ జీవో విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ / ప్లాన్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ – ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం (బిపిఎస్–2025) రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు బిల్డింగ్ క్రమబద్ధీకరణకు బుధవారం జీవో జారీ చేసింది.
ఎవరు అప్లై చేయొచ్చు?
01-01-1985 నుండి 31-08-2025 మధ్య కట్టిన బిల్డింగ్స్,మున్సిపాలిటీ, కార్పొరేషన్, యు డి ఎ , సి ఆర్ డి ఏ, వి ఏం ఆర్ డి ఏ, ఐలా పరిధిలో ఉన్నవారు ఈ స్కీం లో కింద అప్లై చేసుకోవచ్చు.
ఎవరు అప్లై చేయలేరు?
ప్రభుత్వ భూములు / ఎండోవ్మెంట్స్ / సాగర్ / నది / వాగు / ట్యాంక్ బెడ్,మాస్టర్ ప్లాన్‌లో రోడ్ / ఓపెన్ స్పేస్ / పార్క్‌కు వినియోగించే ల్యాండ్లు,31-08-2025 తర్వాత కట్టిన నిర్మాణాలు,ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నవి అప్లై చేయలేరు.
ఎలా అప్లై చేయాలి?
వెబ్సైట్ www.bps.ap.gov.in అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ, ఈసీ అండ్ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, ప్లాన్ (ఉంటే), బిల్డింగ్ ఫోటోలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నుండి), ఇండిమిటి బాండ్ (అనేగ్జర్ 4)
ఫీజులు / చార్జీలు
ప్లాట్ సైజ్ + డివియేషన్ శాతం + ల్యాండ్ విలువ ఆధారంగా చార్జీలు.అప్లై సమయంలో 10,000 ముందస్తు చెల్లింపు తప్పనిసరి.
పాత బిల్డింగ్స్‌కు డిస్కౌంట్
31-12-1997 లోపల ఉన్నవైతే 25శాతం తగ్గింపు, స్లమ్ ప్రాంతాలు – 50శాతం తగ్గింపు.
అప్లై చేయడానికి గడువు
నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజులు మాత్రమే.ఇది తుది అవకాశమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *