
- కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
- సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ టెన్త్ విద్యార్థులకు శుభవార్త
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. విద్యార్థులపై తమకున్న అభిమానాన్ని బహిర్గతం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ చెల్లించవలసిన పరీక్ష ఫీజును ఎస్ఎస్సీ బోర్డుకు తానే స్వయంగా కడతానని గురువారం ప్రకటించారు.ఈ మొత్తాన్ని తనకు వచ్చే ఎంపీ వేతనం నుంచి భరిస్తానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందించిన అంత్యోదయ స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా ప్రకటించారు.విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ అంశంపై హైదరాబాద్ జిల్లాకలెక్టర్ హరిచందనకు రాసిన లేఖను ఆయన ‘ఎక్స్’లో షేర్ చేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News