
డిడిఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
చిత్తూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా గురువారం ఉదయం చిత్తూరులో డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడి నుండి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 77 నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. మినీ కలెక్టరేట్ తరహాలో ప్రజలకు సేవలు అందించేలా ఆర్డీవో స్థాయి అధికారిని ఈ కార్యాలయాల్లో నియమించడమే కాకుండా, రెండు దశాబ్దాలకు పైగా పదోన్నతులు లేక ఒకే పోస్ట్ లో కొనసాగుతున్న దాదాపు 10 వేల మంది అధికారులకు పదోన్నతి కల్పించి, వారు మరింత బలంగా పనిచేసేలా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News