తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

  • భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం
  • సీఎం రేవంత్ రెడ్డి తో తెలుగు చిత్ర సినీ పరిశ్రమ ప్రముఖులు సమావేశం
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అన్న అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమఅభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్బంగా వారు ముఖ్యమంత్రి తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. ప్రముఖ నటులు చిరంజీవి, రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నటులు nజెనీలియా దేశ్‌ముఖ్, అక్కినేని అమల,అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాంప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండేతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్: ఒక్కో సంఘానికి 15 వేలు

అమరావతి,ఐఏషియ న్యూస్: నూతనంగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *