భారత నిపుణులకు అమెరికా గట్టి దెబ్బ

  • హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి
  • భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: హెచ్‌-1బీ,హె-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది.ప్రామాణిక వీసా స్క్రీనింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలనను అన్ని హెచ్‌-1బీ,హె-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరుల‌కు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఈ నెల‌ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, దీంతో ఈ వీసా కేటగిరీలకు సంబంధించి అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశముందని ఎంబసీతెలిపింది.దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే భారత్‌లో ఈ నెలాఖరులో జరగాల్సిన వేలాది హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా పలు నెలల పాటు వాయిదా వేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.అమెరికా టెక్నాలజీ కంపెనీలు విస్తృతంగా వినియోగించే హెచ్‌-1బీ వీసా కార్యక్రమంలో భారతీయ నిపుణులు ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులు, వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే హెచ్‌-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు చెబుతున్నారు.అత్యుత్తమ విదేశీ ప్రతిభనునియమించుకునేఅవకాశాన్నికొనసాగిస్తూనే, అక్రమాలు జరగకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఎంబసీ వివరించింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అంగన్వాడి కార్యకర్తలకు ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *