అంతర్వేది,ఐఏషియ న్యూస్: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకుచేప చిక్కింది.10-12 కిలోల బరువున్న ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. సాధారణంగా అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు,గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని వైద్యులు తెలిపారు. Authored by: Vaddadi udayakumar
Read More »admin
19న వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం
అమరావతి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కేంద్ర కమిటీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మ్యాంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం
రక్తదానానికి ముందడుగు వేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయభారతి చింతపల్లి,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా మెగా రక్తదాన శిబిరంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థినీ ,విద్యార్థులు మరియు అధ్యాపకులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 54 మంది రక్త దానము చేశారు. దీనికి సంబంధించి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయిన జిల్లాకలెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ సంతకంతో, రెడ్ క్రాస్ నోడల్ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్స్ ను సోమవారం …
Read More »జాతీయ అవార్డు గ్రహీత హెచ్ఎం శ్రీదేవిని అభినందించిన జీవీఎంసీ కమిషనర్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమ స్థానం ఉపాధ్యాయులదేనని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా భీమిలి జీవీఎంసీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో …
Read More »సంక్షేమం అంటే దానం కాదు… సాధికారతకు మార్గం
హాస్టళ్లకు కొత్త లుక్ రావాలి… హాస్టళ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులిస్తాం యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు నిర్వహించండి త్వరలో శాశ్వత కుల ధృవపత్రాలు విద్యారుణాలపై వడ్డీ భారం తగ్గించేలా త్వరలో కొత్త పథకం ప్రాంతాల మధ్య అభివృద్ధిలో పోటీ తొలిరోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు…వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని చెప్పారు. సోమవారం రాష్ట్ర …
Read More »ఏపీలో ఉచిత బస్ ప్రయాణానికి నెల రోజులు
3.17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం మహిళలకు 118 కోట్లు రూపాయల లబ్ధి ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీ స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటికి నెల …
Read More »శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తుల రవాణా భద్రతపై ఎస్పీ సుబ్బారాయుడు సమావేశం
తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఇందులో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం …
Read More »మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాంకు విమానాశ్రయంలో ఘన స్వాగతం
స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి,ఐఏషియ న్యూస్: మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు సోమవారం చేరుకున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మారిషస్ ప్రధాని.మారిషస్ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, పలువురు నేతలు, ఉన్నతాధికారులు.రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమమునకు చేరుకొని,అనంతరం తిరుమల చేరుకోనున్న మారిషస్ ప్రధాని.మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం. Authored by: Vaddadi udayakumar
Read More »తెలుగును బతికించండి మహాప్రభో…
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యాబోధనకు పెద్ద పీట వేసి, ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని “తెలుగు దండు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో గాంధేయ మార్గంలో సాగే మాతృభాష పరిరక్షణ ఉద్యమ ఉధృతిని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నంలోని తెలుగు దండు కార్యాలయంలో సోమవారం ఉదయం తెలుగు భాషాభిమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదండు …
Read More »