ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇప్పటికే రుణాలు, ఇతర సాయం చేస్తున్న ప్రభుత్వం తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగుల యువత ఉంటే వారి కోసం ప్రత్యేకజాబ్,మేళాలునిర్వహించబోతోంది.పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా 100 ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం …
Read More »admin
శబరిమల అయ్యప్ప ఆలయం 17 నుంచి 22 వరకు తెరిచి ఉంటుంది
శబరిమల,ఐఏషియ న్యూస్: శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తులం మాస పూజల కోసం ఈనెల 17- 22 వరకు తెరవనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఉదయాస్తమాన పూజ, పడిపూజ, కలశాభిషేకం, పుష్పాభిషేకం వంటి ఐదు రోజుల ప్రత్యేక ఆచారాల తర్వాత 22న రాత్రి 10 గంటలకు మూసివేస్తామని తెలిపింది. దర్శనం కోసం వర్చ్యువల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.ఇదే సమయంలో గర్భగుడి ముందున్న …
Read More »ఇకపై ఆధార్ ఉంటేనే ట్రైన్ టికెట్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రైల్వే టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు రైల్వే శాఖ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈనెల1 నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే, ఆ ఖాతాకు ఉన్న మొబైల్ నంబరు ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లింక్ చేసిన ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు పొందగలరు, లింక్ కానివారు 8.15 గంటల తరువాత మాత్రమే బుక్ చేసుకోవచ్చు. విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలి. Authored …
Read More »5 లక్షల మందికి ఉద్యోగాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన వరాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన తన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చేయగలిగినంత చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధ్రువీకరించారు. పలాస కార్గో ఎయిర్ పోర్ట్ పై ప్రజాభిప్రాయ సేకరణ పలాస కార్గో ఎయిర్పోర్ట్ పైన స్థానికులు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్గో విమానాశ్రయ …
Read More »గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన రాష్ట్ర వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు
విజయనగరం,ఐఏషియ న్యూస్: గోవా గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పూసపాటి అశోక్ గజపతి రాజుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం విజయనగరంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్కరించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »కేజీహేచ్ లో విద్యార్థినులను పరామర్శించిన హోం మంత్రి అనిత
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హోం మంత్రి అనిత మాట్లాడారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని, వైద్యు నిపుణులతో ఓ కమిటీ వేశామని తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు …
Read More »రెవిన్యూ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పార్వతీపురం,ఐఏషియ న్యూస్: కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటుచేసిన రెవిన్యూ క్లినిక్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటుచేసిన వివిధ విభాగాలను ఆమె ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది తో కలిసి పరిశీలించారు. రెవిన్యూ క్లినిక్ విచ్చేసిన అర్జీదారులతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »తిరుపతిలో చైన్స్ స్నాచర్స్ హల్చల్
తిరుపతి,ఐఏషియ న్యూస్:: తిరుపతి నగరంలో చైన్స్ స్నాచర్స్ హల్చల్ చేశారు.ఐదుగురు మహిళ మెడలో గొలుసులు తెంచుకొని పారిపోయారు.శనివారం 3 నుంచి 5 గంటల మధ్య చేతివాటం ప్రదర్శించిన చైన్ స్నాచార్లు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోచోట చోరీ జరిగిన వైనం. ఈస్ట్ పోలీస్ స్టేషన్లోనే పోస్టల్ కాలనీలో ఓ మహిళ మెడలో చైన్ తెంపుకెళ్ళిన ఘటన జరిగింది.అలిపిరి పోలీస్ స్టేషన్ లోని ఉపాధ్యాయనగర్, గొల్లవానిగుంట, రాయల్ ఓక్ షో రూమ్ సందులో, గంగారాం ఫంక్షన్ …
Read More »ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం
మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ అమరావతి,ఐఏషియ న్యూస్: గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత పెట్టారు. గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారు. మీ రుణం తీర్చుకోవడమే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని …
Read More »జపాన్ తదుపరి ప్రధానిగా సనై తకైచి.. తొలిసారి మహిళకు అవకాశం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో ఈమె ప్రధాని పదవి చేపట్టనున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రానున్నది. Authored by: Vaddadi udayakumar
Read More »