Business

కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన పులిమచ్చల చేప

అంతర్వేది,ఐఏషియ న్యూస్: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకుచేప చిక్కింది.10-12 కిలోల బరువున్న ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. సాధారణంగా అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు,గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని వైద్యులు తెలిపారు. Authored by: Vaddadi udayakumar

Read More »

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మ్యాంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 …

Read More »

కాకినాడ ఎంపీకి సైబర్ షాక్

వాట్సాప్ డీపీతో రూ.92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేసిన పోలీసులు కాకినాడ,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా రూ.92 …

Read More »

నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ చైర్మన్ గా తెలుగుతేజం ఇంజేటి శ్రీనివాస్ నియామకం

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిశా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) మాజీ వ్యవస్థాపక చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) చైర్మన్ గా నియమితులయ్యారు. మంగళవారం నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఎన్ఎస్ఈకి సారథి లేరు. తొలి పబ్లిక్ ఇష్యూకి (ఐపీఓ) ఎక్స్ఛేంజీ సిద్ధం అవుతున్న సమయంలో తెలుగు మూలాలున్న శ్రీనివాస్ నియామకం జరిగింది. ఆయన ఇటీవల ఎన్ఎస్ఈలో పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ గా చేరారు. గతంలో …

Read More »

20ఏళ్లు పూర్తి చేసుకున్న టీవీఎస్ అపాచీ

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పోర్టుఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన “అపాచీ మోటార్‌సైకిల్‌” మార్కెట్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో మంగళవారం కంపెనీ డైరెక్టర్‌, సీఈఓ కేఎన్‌ రాధాకృష్ణన్‌ మార్కెట్లోకి లిమిటెడ్‌ ఎడిషన్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ శ్రేణి మోటార్‌ సైకిళ్లను విడుదల చేశారు. 2005లో అపాచీ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని రాధాకృష్ణన్‌ తెలిపారు. దాదాపు 80కి పైగా దేశాల్లో 65 లక్షల మంది వినియోగదారులకు అపాచీ అత్యంత …

Read More »

విజయవాడలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ: 25వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్

విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈనెల 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో మహిళలు సంతోషంగా ఉన్నా ఈ పథకం ప్రభావం ఆటో డ్రైవర్లపై తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లుతమను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్తపథకం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ మంగళవారం విజయవాడలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు.బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు …

Read More »

నాన్ స్టాప్ బస్సులకు తగ్గిన ఆదాయం: సర్వీసులు తగ్గిస్తున్న ఆర్టీసీ అధికారులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ తీరుతో ఏపీ వ్యాప్తంగా మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో కొత్త సమస్య కూడా వచ్చి పడింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తూ ఉండడంతో నాన్ స్టాప్ బస్సు సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడుతుంది. స్త్రీశక్తి పథకంతో నాన్ స్టాప్ బస్సులకు దెబ్బ నాన్ స్టాప్ …

Read More »

రెండుకోట్ల విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నగరంలో రద్దయిన పెద్ద నోట్లు భారీమొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి ఎక్కడికి తీసుకు …

Read More »

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా …

Read More »

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి త్వరలో ప్రారంభోత్సవం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని వియ్యం ఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కైలాసగిరి మీద ఇటీవల సుమారు 5.50 కోట్ల రూపాయల ఖర్చుతో త్రిశూలం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా సుమారు 7 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ తో విశాఖకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ …

Read More »