సింహాచలం,,ఐఏషియ న్యూస్: సింహాచలం దేవస్థానానికి వచ్చే సీనియర్ సిటిజన్, దివ్యాంగ భక్తుల కోసం విశాఖ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రహీమున్నీసా తన తండ్రి షేక్ ఖాదర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆలయ అధికారి సునీల్ కు రెండు వీల్ చైర్స్ అందజేశారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రహీమున్నీసా తెలియజేశారు.అనంతరం సింహాద్రి నాధుని దర్శించుకున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »Spiritual
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు గవర్నర్ కు ఆహ్వానం
ఆహ్వానించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో నాయక్ విజయవాడ,ఐఏషియ న్యూస్: దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వి.కె.శీనా నాయక్‌తో కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని వారు గవర్నర్ కు దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో నాయక్ అన్ని విషయాలు వివరించారు. Authored by: Vaddadi udayakumar
Read More »సిరిమాను చెట్టు గుర్తింపు
విజయనగరం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టు గుర్తింపు పూర్తయ్యింది. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించినట్లు పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు వెళ్లడించారు.దీంతో ఈ గ్రామానికి చెందిన చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ కల్లాల్లో సిరిమాను, లోకవరపు సత్యం కల్లంలో ఇరుసుమానును గుర్తించారు.అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు బుధవారం వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య సంప్రదాయబధ్దంగా పూజలు నిర్వహించి, బొట్టు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి గాదె శ్రీనివాసులనాయుడు, …
Read More »తుని తలుపులమ్మలోవ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యం
17 కోట్ల వ్యయంతో అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం నాలుగు కోట్లతో ఎస్కలేటర్ ఏర్పాటు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఓ ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని తునిలో ఉన్న తలుపులమ్మ లోవ అమ్మవారి గుడిలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. 17 కోట్ల రూపాయలతో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నాలుగు కోట్ల రూపాయలతో ఎస్కలేటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలుచేపడుతున్నారు. ఎస్కలేటర్ ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సౌకర్యం ఏర్పాటుచేస్తున్న మొదటి దేవాలయం …
Read More »సింహగిరిపై ఉల్లాసంగా ఉత్సాహంగా ఉట్ల ఉత్సవం
సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహగిరిపై మంగళవారం సాయంకాలం వేళలో శ్రీ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీవైష్ణవకృష్ణజన్మాష్టమి పర్వదినమును పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు సహాయ నిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలోఆలయ స్థానాచార్యులు డాక్టర్.టి పి రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాసచార్యులు, సీతారామాచార్యులు వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందంచే సింహగిరిపై అత్యంత వైభవముగా ఉట్ల ఉత్సవం వేణుగోపాల అలంకరణలో జరిగింది. రాజగోపురం ఎదురుగాగల ప్రాంగణము నందు ప్రతి సంవత్సరం వలె యాదవ వంశమునకు చెందిన భక్తునిచే ఉట్టిని కొడుతూ ప్రధాన అర్చకులు గొడవర్తి సీతారామాచార్యులు ఉట్టిని …
Read More »శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తుల రవాణా భద్రతపై ఎస్పీ సుబ్బారాయుడు సమావేశం
తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసులతో సమావేశం నిర్వహించారు.ఇందులో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్ సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం …
Read More »మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాంకు విమానాశ్రయంలో ఘన స్వాగతం
స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి,ఐఏషియ న్యూస్: మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు సోమవారం చేరుకున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన మారిషస్ ప్రధాని.మారిషస్ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, పలువురు నేతలు, ఉన్నతాధికారులు.రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమమునకు చేరుకొని,అనంతరం తిరుమల చేరుకోనున్న మారిషస్ ప్రధాని.మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం. Authored by: Vaddadi udayakumar
Read More »తెలుగును బతికించండి మహాప్రభో…
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తెలుగును ఓ పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యాబోధనకు పెద్ద పీట వేసి, ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని “తెలుగు దండు” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం పట్ల సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో గాంధేయ మార్గంలో సాగే మాతృభాష పరిరక్షణ ఉద్యమ ఉధృతిని రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖపట్నంలోని తెలుగు దండు కార్యాలయంలో సోమవారం ఉదయం తెలుగు భాషాభిమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదండు …
Read More »టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు తమిళనాడు రాష్ట్ర మంత్రి నెహ్రూ 44 లక్షలు విరాళం
తిరుమల,ఐఏషియ న్యూస్: తమిళనాడు రాష్ట్ర మంత్రి కెఎన్ నెహ్రూ నవంబర్ 9న తన పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నప్రసాదం వితరణకు అయ్యే ఖర్చు రూ 44 లక్షలు టిటిడి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కువిరాళమిచ్చిన దాత కెఎన్ నెహ్రూ టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలోచైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డిడిని అందజేసిన దాత తరపు ప్రతినిధి సురేష్. Authored by: Vaddadi udayakumar
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
తిరుమల,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న నిర్మల సీతారామన్ కు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటోను అందజేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు …
Read More »