ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి పెరిగిన జిల్లాలు. రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు బుధవారం నుంచి అమలు.మార్కాపురం, పోలవరం జిల్లాలుఏర్పాటుచేస్తూతుదినోటిఫికేషన్‌.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌.నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్పు చేశారుసామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్పు చేయడం జరిగింది.పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు. జారీ అయ్యాయి. పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మారుస్తూ తుది నోటిఫికేషన్‌ విడుదల చేశారు.అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆగేవరకు పోరాటం ఆగదు

గవర్నర్ ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేసిన మాజీ సీఎం జగన్ విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో రాజకీయం ఆసక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *