విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీశ్రీ కళా వేదిక వారి 150వ కవి సమ్మేళనం విశాఖపట్నం రైల్వే ఫంక్షన్ హాలు శుభం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు.విశాఖ నగరానికి చెందిన విద్యావేత్త, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి పద్మజ, “ఉద్యమ జ్యోతి భారత కీర్తి పతాక అల్లూరి” శీర్షికతో స్వాతంత్ర్య పోరాట యోధుడైన అల్లూరి సీతారామరాజుపై కవిత వినిపించారు.వీరి కవితలు ఆహుతులను అలరించాయి.శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , డాక్టర్ పార్థసారథి , శ్రీహరి కోటి విశాఖ జిల్లా అధ్యక్షులు కొలిచిన జగన్నాథం ఆధ్వర్యంలో కవయిత్రి పద్మజను ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంలో స్నేహితులు,బంధువులు తోటి కవయిత్రులు పద్మజకు అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News