378 రక్తదాన శిబిరాల్లో 56,265 యూనిట్ల రక్తం సేకరణ

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా గుజరాత్ లో ప్రపంచ రికార్డు

అహ్మదాబాద్‌,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి బుధవారం అడుగుపెట్టారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ఏబిటి వైపి) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ ‘నమో కే నామ్ రక్తదాన్’ బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పాల్గొన్ని ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఏకంగా 378 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 56,265 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.దేశ చరిత్రలో ఒక నాయకుడి పుట్టినరోజు కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇంత భారీ మొత్తంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రభుత్వ ఉద్యోగులు జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *