విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విస్తరణ

నేషనల్ హైవే 65 విస్తరణకు కేంద్రం ఆమోదం

విజయవాడ,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 పై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నేషనల్ హైవే 65 ను విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్, విజయవాడ 65వ జాతీయ రహదారిని విస్తరించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం అవసరమైన భూ సేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆ నేషనల్ హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
నేషనల్ హైవే 65 విస్తరణలో భాగంగా 40 కిలోమీటర్ నుండి 269 కిలోమీటర్ల వరకు మొత్తం 229 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసల నుండి ఆరు వరుసలకి పెంచడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికోసం అవసరమైన భూసేకరణకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రెండు రాష్ట్రాల పరిధిలో ఆయా జిల్లాల అధికారులకు భూసేకరణ బాధ్యతలను అప్పగించారు.
తెలంగాణలో ఈ జిల్లాలలో భూసేకరణ
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రెవిన్యూ డివిజనల్ అధికారులు భూసేకరణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లో తొమ్మిది గ్రామాలు, నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి లో ఐదు గ్రామాలు, చిట్యాల లో ఐదు గ్రామాలు, కట్టంగూర్ లో నాలుగు, నకిరేకల్లో రెండు, కేతేపల్లి లో నాలుగు గ్రామాలలో భూసేకరణ చేయనున్నారు.
భూసేకరణ బాధ్యతలను అధికారులకు అప్పగింత
ఆర్డీవోలు సూర్యాపేట మండలంలో నాలుగు గ్రామాలు, చివ్వెంలలో ఆరు గ్రామాలు, కోదాడ మండలం లో నాలుగు గ్రామాలు మునగాల మండలం లో ఐదు గ్రామాలలో భూసేకరణ పనులు చేయనున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్లు భూసేకరణ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇక్కడ నందిగామ మండలంలో నాలుగు గ్రామాలు, కంచికచర్లలో నాలుగు గ్రామాలు, జగ్గయ్యపేటలో ఏడు గ్రామాలు, పెనుగంచిప్రోలులో మూడు గ్రామాలలో భూసేకరణ చేయనున్నారు.
హైవే విస్తరణకు ఏయే జిల్లాలలో ఎంత దూరం అంటే?
ఇబ్రహీంపట్నంలో 12 గ్రామాలు, విజయవాడ రూరల్ లో ఒకటి, విజయవాడ వెస్ట్ లో రెండు, విజయవాbడ నార్త్ పరిధిలో ఒక గ్రామంలో భూసేకరణను చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 39.54 కిలోమీటర్ల నుండి 62 .2 కిలోమీటర్ల వరకు, నల్గొండ జిల్లాలో 62.2 కిలోమీటర్ల నుండి 126.8 కిలోమీటర్ల వరకు, సూర్యాపేట జిల్లాలో 126.8 కిలోమీటర్ల నుండి 191.2 కిలోమీటర్ల వరకు హైవే విస్తరణ జరగనుంది.
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు కేంద్రం చేసిన ప్రకటన శుభవార్త
ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో 191.2 కిలోమీటర్ల నుండి 270 .86 కిలోమీటర్ల వరకు విస్తరణకు భూసేకరణ చేయనున్నారు. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ ప్రయాణాలు చేసే వారికి నేషనల్ హైవే 65 విస్తరణకు సంబంధించి తాజాగా కేంద్రం చేసిన ప్రకటన శుభవార్త అని చెప్పాలి.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *