
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు,ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని,ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News