విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్స్ (5జి టెక్నాలజీ) 12,500 ఖరీదైన మొబైల్ ఫోన్స్ ను సౌత్ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా 90 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ కి సంబంధించిన పోషణ ట్రాకర్ బాల సంజీవిని మరింత వేగంగా లబ్ధిదారుల నమోదు, 6 సంవత్సరాల లోపు పిల్లల గ్రోత్ మానిటరింగ్ ఆన్లైన్ వర్క్ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు 5జి టెక్నాలజీ ఫోన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉచితంగా అంగన్వాడీలకు అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందనిమరొకసారితెలియజేశారుకార్యకమంలో సిడిపిఓ నీలిమ,సూపర్వైజర్లు వెన్నిసా,కుమారి పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News