admin

ఆరవసారి “రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం” సాధించిన తెలుగుబిడ్డ సందీప్ చక్రవర్తి

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ జీ.వి. సందీప్ చక్రవర్తి. ఆరోసారి రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం (పిఎంజి) అందుకుని అరుదైన ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధికసార్లు ఈ పతకం పొందిన కొద్దిమంది అగ్ర ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరిగా నిలిచారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, విశేషాలు.. …

Read More »

ప్రజలపై తుపాకి ఎక్కుపెట్టిన శత్రువులు ఎంతటివారైనా వదిలిపెట్టం…

ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణలో ప్రధాని మోడీ ఉద్వేగ ప్రసంగం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:  యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు,అధికారులు,ఈ కార్యక్రమాలకు …

Read More »

విద్యుత్ శాఖలో త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎంకు వివరించారు.సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పాలి. Authored by: Vaddadi …

Read More »

వాడపల్లిలో (దేశ)భక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు

(వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఈ తరం వారికి తెలియని ఇంకో ముఖ్యమైన చరిత్ర ఇక్కడ దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ దైవ భక్తులతో పాటు దేశ భక్తులు పుష్కలంగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన రోజులవి.ఈ ఊరు చిన్నదైనా అక్కడ నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాల్ని నాటారు. రక్తాన్ని ధారపోశారు. ఈ త్యాగాలు ఆ పల్లె కోసం …

Read More »

కోదండరాం, ఆలింఖాన్ ఎమ్మెల్సీ పదవులు రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ ఎమ్మెల్సీలు గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకం రద్దు చేస్తూ సుప్రీం తీర్పువెలువరించింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందనివెల్లడించింది. తమ నియామకం చేపట్టకుండా ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించటంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపైన హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. కాగా, బుధవారం కోదండరాం, ఆలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ తుది తీర్పు కోసం …

Read More »

మట్టిలో దాగున్న బంగారు నిధి..మన దేశంలోని 5 పెద్ద బంగారు గనులివే

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. భూగర్భ శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా కష్టపడి చేసిన పరిశోధనల తర్వాత ఈ అరుదైన విషయాన్ని ధృవీకరించారు.ఈ కొత్త ఆవిష్కరణ మధ్యప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఇలాంటి బంగారు నిధులున్నాయి.ఆ విశేషాలు, భారతదేశంలోని అతిపెద్ద ఐదు బంగారు గనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ హట్టి గోల్డ్ మైన్స్ భారతదేశంలోనే …

Read More »

సామాజిక సేవలో సిఎల్సి చర్చి

విద్యార్థులకు గ్లాసులు,మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ బుచ్చయ్యపేట,,ఐఏషియ న్యూస్: అమెరికా దేశీయుల సహకారంతో, గాజువాక సిఎల్సి చర్చి అధినేత సుధీర్ కే మహంతి ఆధ్వర్యంలో బుధవారం బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, కంచాలు పంపిణీ చేయడంతో పాటు, ఎల్బీపురం, బంగారు మెట్టల మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే త్రాగునీటి బోర్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మహంతి అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి. అమెరికాలోపుట్టి,భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సేవా …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »

జిల్లాల పునర్విభజనపై మంత్రుల బృందం కసరత్తు

29, 30 తేదీల్లో 13 జిల్లాల్లో మంత్రుల బృందం పర్యటనకు ముహూర్తం ఖరారు సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్న మంత్రుల బృందం డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తి (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో జిల్లాల పునర్విభజనపై మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం నియమించిన మంత్రుల బృందం బుధవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. ఇందులో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ …

Read More »

టీజీఎస్ఆర్టీసీ రాఖీ రికార్డు.. 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాఖీ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్దఎత్తున వినియోగించుకున్నారు.6 రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.ఈ నెల 9న రాఖీ పండుగ నాడు 45.62 ల‌క్షల మంది మహిళలు ప్రయాణించారు.11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు.ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి.గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల మంది రాకపోకలు సాగించారు.ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సందర్భం బట్టి భారీగా వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఏది …

Read More »