admin

నిజాయితీని నిరూపించుకున్న బాలుడు

  గుంటూరు,ఐఏషియ న్యూస్: గుంటూరు పట్టణానికి చెందిన కటికం భారతి అను మహిళ సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు వచ్చి మంగళగిరి కొత్త బస్టాండ్ దగ్గర తన పర్స్ పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన అనంతరం కొద్దిసేపటికి ఆమె పర్సు దొరికింది. ఈ నేపథ్యంలో ఒక బాలుడు నిజాయితీగా ఆ యొక్క పర్సు తీసుకుని వచ్చి మంగళగిరి పట్టణ పోలీసు స్టేషన్ యందు సిఐని కలిసి జరిగిన వాస్తవాలు తెలియపరచగా అందులో ఫిర్యాది కటికం భారతి చెప్పిన విధంగా …

Read More »

సివిల్స్ ఫ్రీ క్వాలిఫై విద్యార్థులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యారంగంపై దృష్టి సారించి పలు కీలక సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ లాంటి అత్యంత కఠినమైన పోటీ పరీక్షలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వాళ్లు మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున పంపిణీ చేసింది. ఈమేరకు చెక్కులను విడుదల చేసింది. దీనిలో భాగంగానే సివిల్స్-2025 …

Read More »

ఏకపక్షంగా లక్షల ఓట్లు రద్దు చేయడం దారుణం

మంగళగిరి,ఐఏషియ న్యూస్: ఓట్లు సవరణల పేరుతో ఏకపక్షంగా 67 లక్షల ఓట్లను బీహార్లో రద్దు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఎం జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. శుక్రవారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వి వి జవహర్లాల్ అధ్యక్ష వహించారు. వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణల పేరుతో …

Read More »

అల్లూరి జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి రూ.45.02 కోట్లు మంజూరు

మారుమూల గిరిజన స్కూళ్ల అభివృద్ధికి మంత్రి లోకేష్ చొరవ అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర విద్యారంగంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య,ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యా శాఖను సవాల్ గా స్వీకరించిన లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్… వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుంకట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరుశాతం శాశ్వత …

Read More »

దేశంలో అత్యంత సురక్షితమైన టాప్ టెన్ నగరాలు ఇవే

ఈ జాబితాలో హైదరాబాదుకు దక్కని చోటు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు,దొంగతనాలు,మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్‌ లో టాప్‌-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటకరాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది.అలాగే …

Read More »

వైభవోపేతంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతికి కదలివచ్చిన అష్టలక్ష్మిలు మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలతో వరలక్ష్మీ మండపాలంకారం తిరుపతి,ఐఏషియ న్యూస్: శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం నాడు తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారికి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు.ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారు ఆశీనులైన బంగారు రథానికి దారి పొడవునా హారతులు పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. నాలుగు …

Read More »

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై కన్నేసిన ట్రంప్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ గత దశాబ్ద కాలంగా భారత్ ను అతిపెద్ద మార్కెట్‌గా పరిగణిస్తోంది. ట్రంప్ ఆర్గనైజేషన్ పలు ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్‌లలో ఏడు ప్రాజెక్టుల ద్వారా కనీసం గత ఆర్థిక సంవత్సరంలో 175 కోట్ల రూపాయలను ఆర్జించింది.ఈ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటోంది ట్రంప్ ఆర్గనైజేషన్.2024 నవంబర్ 5న ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే- తన భారత వ్యాపార భాగస్వామి ట్రైబెకా డెవలపర్‌తో …

Read More »

ఉపరాష్ట్రపతిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్?

కేంద్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణలు మైనార్టీ వర్గానికి ఉపరాష్ట్రపతి పదవి కేటాయించాలని ప్రధాని మోడీ నిర్ణయం (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. జగదీప్ ధన్‌కర్ రాజీనామా తర్వాత కొత్త లెక్కలు తెరమీదకు వచ్చాయి. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదలైంది. ఎన్డీయే అభ్యర్థి ఖరారు తర్వాత ఇండియా బ్లాక్ నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కొత్త ఉపరాష్ట్రపతిగా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.అయితే అనూహ్యంగా దక్షిణాదికే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు విశ్వసనీయ …

Read More »

8న వరలక్ష్మి వ్రతం

స్పెషల్ డస్క్,ఐఏషియ న్యూస్: శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మివ్రతాన్నిఅత్యంతభక్తిశ్రద్ధలతోజరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం,ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం .వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు …

Read More »