admin

మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పార్వతీపురం /మక్కువ,ఐఏషియ న్యూస్: మక్కువ మండలంలోని ఆరు గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. బుధవారం 6 గిరిజన గ్రామాలలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది.మండలంలోని బాగుజోలలో 24 కుటుంబాలు, చిలక మెండంగి లో 48 కుటుంబాలు, బెండమెడంగిలో ఐదు కుటుంబాలు, తాడిపుట్టిలో 10 కుటుంబాలు, దోయ్ వర లో ఐదు కుటుంబాలు, సిరివరలో 130 కుటుంబాలు వెరసి 222 కుటుంబాలకు, కుటుంబానికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ జరిగింది. రగ్గులు పంపిణీ పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం …

Read More »

సాహితీవేత్త దేవులపల్లి పద్మజకు ఘన సత్కారం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీశ్రీ కళా వేదిక వారి 150వ కవి సమ్మేళనం విశాఖపట్నం రైల్వే ఫంక్షన్ హాలు శుభం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు.విశాఖ నగరానికి చెందిన విద్యావేత్త, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి పద్మజ, “ఉద్యమ జ్యోతి భారత కీర్తి పతాక అల్లూరి” శీర్షికతో స్వాతంత్ర్య పోరాట యోధుడైన అల్లూరి సీతారామరాజుపై కవిత వినిపించారు.వీరి కవితలు ఆహుతులను అలరించాయి.శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , డాక్టర్ పార్థసారథి , శ్రీహరి …

Read More »

తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు …

Read More »

కనీస పాస్ మార్కులను 35 నుంచి 33కు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం పదో తరగతి,ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం 35 మార్కుల పాస్ నిబంధనలను తాజాగా తొలగిస్తూ మార్పులు చేసింది.2025-26 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి,ఇంటర్ పరీక్షల మూల్యాంకన విధానంలో కొత్త నిబంధనలను అమలు చేయనుంది.ఈ ముసాయిదా నిబంధనల్లో రెండు కీలక సూచనలు ప్రకటించింది.ఒకటి పాస్ మార్కులను తగ్గించడం,రెండు అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్) మార్కులను పాస్ మార్కులకు కలపడం. పదవ తరగతి పరీక్షలలో మొత్తం మార్కులలో కనీసం 33 …

Read More »

ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త

ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చేసింది.ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని …

Read More »

సౌత్ కొరియా ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ సిల్వర్ విజేతగా శివకోటి క్షేత్ర

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సౌత్ కొరియాలో ఈనెల 21వ తేదీ నుంచి జరుగుతున్న 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విశాఖ క్రీడాకారిని శివ కోటి క్షేత్ర సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె నగరానికీ చెందిన డి.దినేష్ తో కలిసి ఫెయిర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈమె గతంలో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. ఇప్పుడు మరల తాజాగా సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. …

Read More »

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్

ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్,ఐఏషియా న్యూస్: పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు …

Read More »

శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువగల బంగారు శంఖం,చక్రం విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు.చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం,చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం,చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Authored by: Vaddadi udayakumar

Read More »

క్యూఆర్ కోడ్ తో కొత్తరేషన్ కార్డులు మంజూరు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి ఆగస్టు 25న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది. ఈ వివరాలను ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు.ఏపీలో త్వరలో …

Read More »

పెట్టుబడులు పెట్టండి…పేదలకూ సాయం చేయండి

ఏపీ-సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తాం విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు రండి ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్యూస్: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ పెట్టుబడులు కూడా అత్యంత భద్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏపీ- సింగపూర్ బిజినెస్ ఫోరమ్ తరపున రోడ్ …

Read More »