38 లక్షల నగదు,10 కేజీల బంగారం చోరీ తూముకుంట(శ్రీ సత్య సాయి జిల్లా),ఐఏషియ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లాలోని తూముకుంట పారిశ్రామికవాడలో ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి దుండగులు భారీ దోపిడీ చేశారు.కిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లు కట్ చేసి, లాకర్ తాళాలు విరిచి రూ.38 లక్షలు, 10 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది బ్యాంకు తెరిచి బ్యాంకులో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీ సంఘటనపై పోలీసు అధికారులకు ఫిర్యాదు సంఘటనా స్థలాన్ని డిసిపిమహేశ్, ఎస్ …
Read More »admin
బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే ఆస్తి పన్నుల పేరు మార్పు
ఆగస్టు 1 నుంచి ప్రక్రియ ప్రారంభం ఆస్తి పన్ను పేరు మార్పు కై జీవీఎంసీ కి దరఖాస్తులు అవసరం లేదు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలోనే ఆస్తి పన్నుల పేరు మార్పు జరిపే విధానాన్ని ప్రజల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే …
Read More »జాతీయ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ చార్జీలు మోత ఎత్తివేత
బిజినెస్ డెస్క్,ఐఏషియన్ న్యూస్: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహిస్తున్నారా? లేదంటే ఛార్జీలు పడతాయనే ఆందోళనలో ఉన్నారా? అయితే, ఈ కథనం మీరు చదవాల్సిందే. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఖాతాలో కనీస సగటు నెలవారీ నగదు నిల్వ ఛార్జీలను మాఫీ చేశాయి.తాజాగా ఈ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది. సెప్టెంబర్ త్రైమాసికం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని తెలిపింది.జనరల్ సేవింగ్స్ …
Read More »నాగపంచమి (29-07-2025)
ప్రాణులన్నింటినీ మనం భగవత్స్వరూపంగా భావిస్తాం.అయినప్పటికీ జీవకోటి అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణాన్ని పొంది ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గౌరవాన్ని దక్కించుకున్నది ఒక్క సర్పజాతి మాత్రమే.నాగుల్ని పూజించడమంటే ప్రకృతిని ఆరాధించడం. కీడు తలపెట్టే ప్రాణిలో సైతం పరమాత్మనుచూడాలన్న సందేశమివ్వడం.వ్యవసాయాధారితమైన మనదేశంలో పంటల అభివృద్ధిని ఆటంకపరచే అనేక ప్రాణుల నుంచి పంటను, ప్రాణాలను కాపాడమనే వేడుకోలు నాగపంచమి వేడుకలు.శ్రీమహాలక్ష్మికి ఇష్టప్రదమైనదిశ్రావణమాసం. తాను ధాన్యలక్ష్మిగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన వర్షాలతో ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్ష పంచమిని నాగ పంచమి పర్వదినంగా జరుపుకోవాలని ఆ పూజా …
Read More »గోవా రాష్ట్ర గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయించిన బొంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే భారీగా హాజరైన కేంద్ర,ఏపీ మంత్రులు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియన్ న్యూస్: ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు శనివారం గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గోవా రాజ్ భవన్ లో జరిగినకార్యక్రమంలో అశోక్ గజపతిరాజు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు, ఏపీ …
Read More »విజయవాడ దుర్గగుడిలో సేవ చేయాలనే భక్తులకు శుభవార్త
అమ్మవారి సన్నిధిలో సేవ చేసేవారికి రిజిస్ట్రేషన్,వసతి ప్రారంభించిన ఈవో శీనా నాయక్ విజయవాడ,ఐఏషియన్ న్యూస్: ఇంద్రకీలాద్రి క్షేత్రం కనకదుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆరంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు.దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని పేర్కొన్నారు.భక్తులుకు త్రాగునీరు అందించడం, అన్న ప్రసాద వితరణ,ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, …
Read More »బిఆర్ఎస్ ని బిజెపిలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో చెప్పారు
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు అనకాపల్లి ఐఏషియన్ న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో స్వయంగా అన్నారని రమేష్ ఆరోపించారు.ఈ ఆరోపణ నిజమో, కాదో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. హెచ్‌సీయూ భూముల అమ్మకంలో ప్రభుత్వానికి సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు క్విడ్ ప్రోకోగా …
Read More »పెట్టుబడులు,బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
తొలిరోజు తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గోనున్న సీఎం. భారత హైకమిషనర్ సహా సింగపూర్ పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ. 5 రోజులు… 29 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. అమరావతి,ఐఏషియన్ న్యూస్: రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు ప్రయాణమవుతున్న సీఎం. ఆదివారం ఉదయం 6:25కి సింగపూర్ చాంఘీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు సింగపూర్‌లో ఆ …
Read More »కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్..
కేదార్నాథ్,ఐఏషియన్ న్యూస్:కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది.రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు.యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News