విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: తప్పిపోయిన బిడ్డ ఆచూకీ రెండు గంటల్లో కనుగొన్న వన్ టౌన్ పోలీసులు. ఈ సంఘటన నగరంలోని పూర్ణ మార్కెట్ కొత్త రోడ్డు ప్రాంతంలో జరిగింది. గురువారం 3 సంవత్సరాల వయసు గల రుత్విక్ రాజును వెంట తీసుకొని కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ఇంతలో కొంత సమయం అయిన తర్వాత ఆ బాలుడు తమ వెంట కనిపించకపోవడంతో రుత్విక్ తప్పి పోయాడని గ్రహించిన కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ. జీడి బాబుకు ఈ విషయం …
Read More »Uncategorized
జన్మభూమి ఎక్స్ ప్రెస్ నుంచి జారిపడి బిటెక్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: తుని రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన ఆదిత్య కళాశాల విద్యార్థి గరికిన హేమన్ రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన హేమన్ రాజు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. కళాశాలకు వెళ్లేందుకు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారి పడడంతో అతని రెండు కాళ్లు తెగిపోయాయి. తీవ్రంగా గాయపడిన హేమన్ రాజును విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం …
Read More »గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్ విద్యార్థిని పి కరుణ ప్రపంచ క్రికెట్ కప్‌లో ఎంపిక
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నగర పరిధిలోగల సాగర్ నగర్‌లోని గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కుమారి పి.కరుణ భారతదేశం నుండి మొదటిసారిగా ప్రపంచ క్రికెట్ జట్టులోకి ఎంపికైంది.ప్రపంచంలోనే తొలిసారిగా బాలికల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఆడబోతోంది. గతంలో, బ్లైండ్ బాలుర క్రికెట్ జట్టు ఉండేది, కానీ ఇప్పుడు మహిళా బ్లైండ్ గర్ల్స్ క్రికెట్ జట్టు మొదటిసారి క్రికెట్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కుమారి కరుణ భారతదేశం నుండి పదహారుమంది బాలికల జట్టులో ఎంపికైనందుకు నగరంలోని వేలాది మంది …
Read More »విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు
500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంచనా హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.మంగళవారం తెల్లవారజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగావిడిపోయిగచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం
రక్తదానానికి ముందడుగు వేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయభారతి చింతపల్లి,ఐఏషియ న్యూస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా మెగా రక్తదాన శిబిరంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థినీ ,విద్యార్థులు మరియు అధ్యాపకులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 54 మంది రక్త దానము చేశారు. దీనికి సంబంధించి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అయిన జిల్లాకలెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ సంతకంతో, రెడ్ క్రాస్ నోడల్ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్స్ ను సోమవారం …
Read More »జాతీయ అవార్డు గ్రహీత హెచ్ఎం శ్రీదేవిని అభినందించిన జీవీఎంసీ కమిషనర్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రథమ స్థానం ఉపాధ్యాయులదేనని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా భీమిలి జీవీఎంసీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న సందర్భంగా ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో …
Read More »అల్లూరి జిల్లాలో గిరిజనులకు వంతెన కష్టాలు
పెదబయలు,ఐఏషియ న్యూస్:: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనుల కష్టాలు వర్ణానతీతం.పెదబయలు మండలంలోని జామిగుడ పంచాయతీ పరిధి తారాబుకి చెందిన కుమడ.శ్రీదేవికి శనివారం గుండె నొప్పి వచ్చింది.గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు డోలికట్టి శ్రీదేవికి తారాబు జలపాతం వరకు మోసుకొచ్చి ఎత్తుకొని ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు.అక్కడ నుంచి జీపులో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు మాట్లాడుతూ..ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి తారాబు గ్రామానికి …
Read More »రఘు ఇంజినీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం
భీమునిపట్నం,ఐఏషియ న్యూస్: భీమునిపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అదిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు 498 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు కలిదిండి కరస్పాండెంట్ రమాదేవి ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ జగదీష్ డీన్ డాక్టర్ సతీష్ చౌదరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ కృష్ణ కిషోర్ బి ఎస్ వెంకట్ రెడ్డి విభాగాదిపతులు విద్యార్థులు పాల్గొన్నారు రక్తదాతలకు చైర్మన్ …
Read More »గీతం ఎమ్‌సిఎ విద్యా ర్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలకు ఎంపిక
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ ద్వారా ఎమ్‌సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం లోనే జరిగిన ఈ ప్రాంగణ నియామకంలో ఎమ్‌సిఎ ఆఖరి సంవత్సరం విద్యార్ధులు ఎస్.లహరి మోహన్, ఎమ్.వర్షిణి, పి.భవాని, కె.హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్.మనోజ్ రూ.12.26 లక్షల వార్షిక వేతనంతో మైక్రాన్ సంస్థకు ఎంపికయ్యారు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో ఎమ్‌సిఎ సహ పలు సైన్స్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ప్రత్యేకంగా నిర్వ హిస్తున్న కెరీర్ …
Read More »ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయి చెల్లింపునకు 1,668 కోట్లు విడుదల
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో మే 15వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు చెల్లించవలసిన వేతన బకాయిల సొమ్మును కేంద్రం విడుదల చేసింది. మొత్తం 1,668 కోట్ల రూపాయలను కేంద్ర ఉపాధి హామీ కూలీల కోసం విడుదల చేసింది. ఈ వేతన బకాయిలను కూలీల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.ఏపీలోని ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. త్వరలో మరో …
Read More »
News Website (iasianews.net) I Asia News