న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరళ్లను నియమించింది. దవీందర్‌పాల్ సింగ్, కనకమేడల రవీంద్ర కుమార్‌లను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్స్‌గా నియమించింది.ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ పదవిలో కనకమేడల రవీంద్ర కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాలతో పాటుగా న్యాయరంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కీలక పాత్ర పోషించనున్నారు.కనకమేడల రవీంద్ర కుమార్‌ను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించటంతో టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతలు,కార్యకర్తలు కనకమేడల రవీంద్ర కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ 2018 నుంచి 2024 తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు అలాగే టీడీపీ న్యాయపరమైన విషయాల్లోనూ కనకమేడల కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2024లో ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. అయితే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరటంతో ఆయనకు ఏదైనా కీలక పదవి దక్కవచ్చనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News