రేషన్ కార్డుదారులకు షాక్: ఈనెల 30 వరకే ఛాన్స్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్త స్మార్ట్ కార్డులను మూడు నెలల క్రితం జారీ చేసింది. గ్రామ సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డుల పంపిణీ జరుగుతోంది.అయితే మూడు నెలలు గడిచినా వేలాది కార్డులను లబ్ధిదారుల తీసుకోలేదు. ప్రధానంగా వలస వెళ్లిన లబ్ధిదారులకు కార్డులు తీసుకోవడం కష్టంగా మారింది. అలాగే మరికొందరు కూడా కార్డులు తీసుకోలేదు. దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయాయి. ముఖ్యంగాఅనకాపల్లి మండలంలో అత్యధికంగా 4,220మంది లబ్ధిదారులు కార్డులు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. చోడవరం, నర్సీపట్నం, అచ్యుతాపురం, ఎలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, పరవాడ, రాంబిల్లి, కోటవురట్ల, రావికమతం, కశింకోట, నాతవరం, బుచ్చెయ్యపేట, గొలుగొండ, నక్కపల్లి, కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి, మునగపాక, ఎస్‌ రాయవరంలో చాలామంది కార్డులు తీసుకోలేదు.ఇప్పటికీ కార్డులు అలానే ఉన్నాయి.ఈ క్రమంలో అధికారులు రేషన్‌కార్డుదారులు ఉన్నారా లేదా అంటూ స్థానికంగా ఆరా తీస్తున్నారు.ఒకవేళ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలంటే.. కార్డులోని సభ్యుల్ల ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ వేసి ఓటీపీ చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే బోగస్ రేషన్‌కార్డులు ఉంటే బయటపడుతుంది అంటున్నారు. ఇలా పంపిణీ కాకుండా ఉన్న రేషన్ కార్డుల్ని తహసీల్దారు కార్యాలయాల్లో అప్పగించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. లబ్ధిదారులు ఈ నెలాఖరు నాటికి కార్డులు తీసుకోపోతే వాటిని వెనక్కు పంపేస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డు తీసుకోవాల్సిన వాళ్లు ఉంటే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 30 తర్వాత కార్డుల్ని వెనక్కు పంపిస్తామంటున్నారు..అప్పుడు ఇబ్బందులు తప్పవని, కార్డులు ఉండవన్నారు.
మరోవైపు రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఉన్నవారు వారి వివరాలను ప్రతి ఐదేళ్లకోసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనికోసం ఈ-కేవైసీ చేయించుకోవాలంటున్నారు. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటున్నారు. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో పథకాలు నిలిపివేస్తారని హెచ్చరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా, కార్డులో చిన్న పిల్లలు ఉంటే వారి వేలిముద్రలను నమోదు చేయాలంటున్నారు. ఈ నేపథ్య కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, వారి పేర్లను కార్డు నుంచి తప్పనిసరిగా తొలగించాలని సూచిస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్నవారు వెంటనే తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకోండి. రేషన్‌కార్డులు ఉన్నవారు ఈ రెండు విషయాలను గమనించాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

Indian Diaspora Celebrates BJP’s Historic Victory in West Bengal, Assam, and Puducherry

Over 600 Indian Americans Gathered at Royal Albert Palace, Edison, NJ to Mark Defining Moment …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *