35వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రాజు

ధోన్( కర్నూలు),ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లా ధోన్ మండలంగుంటుపల్లి గ్రామానికి చెందిన దామ వేణుగోపాల్ నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు ధోన్ తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు, జగదుర్తి గ్రామంలోని “డాటెడ్ ల్యాండ్” ను “పట్టా భూమి”గా మార్చడానికి 35వేలు లంచం డిమాండ్ చేసి నాడని, ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం మేరకు ధోన్ తహసీల్దార్ కార్యాలయంపై దాడి నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ సునీల్రాజు లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా ఏసీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచంగా స్వీకరించిన 35 వేలులంచం డబ్బులు సాక్ష్యాలతో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీ కృష్ణయ్య, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.కేసు నమోదు చేసి, తదుపరి విచారణ ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *