ఏపీ విద్యార్థుల కోసం 40 లక్షల నోటుబుక్స్,పెన్నులు

విరాళం ఇచ్చిన కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏపీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌కు చెందిన కంపెనీ భారీ విరాళం ఇచ్చింది. ఏపీ విద్యార్థులకు అమలవుతున్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌ పథకానికి.. కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ విరాళం ఇచ్చింది. దాదాపు రూ.40 లక్షల రూపాయల విలువైన లక్ష నోట్‌ పుస్తకాలు, పెన్నులను అందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వీటిని పంచుతారు. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఈ పుస్తకాలు, పెన్‌లు ఉన్న ట్రక్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహాయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ ఎండీ కేఎల్‌ శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, సమగ్ర శిక్షాఅభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

𝐅𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐖𝐨𝐫𝐤 𝟐𝟎𝟐𝟔: 𝐒𝐤𝐢𝐥𝐥𝐬, 𝐒𝐡𝐢𝐟𝐭𝐬, 𝐚𝐧𝐝 𝐒𝐦𝐚𝐫𝐭 𝐂𝐚𝐫𝐞𝐞𝐫 𝐂𝐡𝐨𝐢𝐜𝐞𝐬!

As we enter 𝟐𝟎𝟐𝟔, the future of work is being reshaped by AI, automation, and …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *