ఏపీలో తిరిగి ప్రారంభమైన ఎన్టీఆర్ వైద్య సేవలు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ అంగీకరించింది.ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ తమ ఆందోళనను విరమించింది. అలాగే ఎన్టీఆర్‌ వైద్యసేవల పునరుద్ధరణకు అంగీకారం తెలిపింది. మరోవైపు చర్చల సందర్భంగా మరో రూ.250 కోట్లు బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. నవంబర్ నెల చివరి నాటికి పెండింగ్ బకాయిలును ఒకే విడతలో చెల్లిస్తామని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చల సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యా్ప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి.మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ నెట్ వర్క్ ఆస్పత్రులు గత 20 రోజులుగా ఆందోళన చేపడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల సమ్మెతో ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించింది. మిగతా బకాయిల మొత్తాన్ని కూడా విడతల వారీగా విడుదల చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె కొనసాగించింది. దీంతో బకాయిలు మొత్తం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నవంబర్‌ చివరికల్లా చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. బిల్లు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదో తేదీ నుంచి సమ్మె జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 841 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉంటే.. సుమారుగా 467 ఆసుపత్రులు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. వీటిలో కొన్ని ఆస్పత్రులు ఎన్టీఆర్‌ వైద్యసేవ ఓపీ నిలిపివేశాయి, కేవలం అత్యవసర సేవలే అందించాయి. మరికొన్ని ఆస్పత్రులు అత్యవసర సేవలతో పాటుగా ఓపీలను కూడా నిలిపివేశాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమ్మె విరమింపజేయడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు సుమారుగా రూ.2,700 కోట్ల వరకూ ఉన్నాయి.దీంతో ఈ బకాయిలను చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *