గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు” గా పేరు మార్పు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: పేరు మార్పు తక్షణమే అమల్లోకి
సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థ పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ సచివాలయాలు ఇకపై “విజన్ యూనిట్స్‌” గా పిలవబడతాయని తెలిపింది. ఈ పేరు మార్పు నేటి నుంచి అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం గ్రామసచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారానే అనేక రకాల ప్రభుత్వ సేవలు, పౌర సేవలు ప్రజలకు అందించారు. మండల తహసిల్దార్ కార్యాలయాల్లో జరగాల్సిన అనేక పనులను గ్రామసచివాలయాల ద్వారానే పరిష్కరించడంతో గ్రామాల్లో ఉండే ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లడం భారీగా తగ్గిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అమలు చేసిన పలు వ్యవస్థల పేర్లను మార్చాలనే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మొదటగా గ్రామ సచివాలయాల పేరును “విజన్ యూనిట్స్‌”గా మార్చాలని నిర్ణయించి తాజాగా అమలు చేసింది. ఈ పేరు మార్పుతో గ్రామ సచివాలయాల వ్యవస్థ కార్యాచరణ, సేవల్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా కేవలం పేరు మాత్రమే మారుతుందా అనే విషయంపై ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.అయితే ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందే విధంగా మార్పులు ఉంటాయని కొత్త ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *