రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి పంటలకు అవార్డులు
  • వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక రైళ్లు
  • వైసిపి అధినేత జగన్ ఆగ్రహం

పులివెందుల,ఐఏషియ న్యూస్: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన లింగాల మండలం అంబకపల్లి గ్రామాల్లో సాగుతున్న అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనను పక్కన వదిలి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారన్నారు. ఉల్లి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారని ద్వజమెత్తారు. హెక్టార్ కు 50వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తర్వాత పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతుల విపత్తుల గురించి ఆలోచించకుండా కేవలం తిరుపతి లడ్డు పై రాజకీయం చేస్తున్నారని బియ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురు కాకుండా కప్పిపుచ్చుకునేందుకు దుష్ట చతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం టిడిపి ఉనికి కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలిపారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటికాయలు టన్ను 25 వేల రూపాయల నుంచి గరిష్టంగా 35 వేల రూపాయలు పలికిందన్నారు. అలాగే 7,700 కోట్ల రూపాయలు పంట కొనుగోళ్లకు వెచ్చించామన్నారు. రైతుల సంక్షేమం కోసం అరటి, చీనీకాయల రవాణా కోసం రైళ్లు ఏర్పాటు చేశామన్నారు. చీని అరటి ఉత్పత్తుల విక్రయాల కోసం అనంతపురం నుంచి ఢిల్లీ, అలాగే తాడిపత్రి నుంచి ముంబై వరకు ప్రత్యేక రైళ్లు నడిచాయన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అరటి పంటలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా అందించింది అన్నారు. నేడు చంద్రబాబు హయాంలో అరటిని కొనుగోలు చేసే వ్యాపారులు రాకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారన్నారు. కొనుగోలు లేక పొలంలోనే పంట కుళ్ళిపోయిన దుస్థితి రావడం హృదయ విధానకరమన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అరటిని కొనుగోలు చేసే వారు లేరు పట్టించుకునే వారు లేరని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేవలం ప్రతిపక్షాల మీద బురదల్లే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏదో ఒక రోజున ప్రజలే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *