గోవా,ఐఏషియ న్యూస్: గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని శుక్రవారం పీఎం మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు.550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News