admin

టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక

ములుగు,ఐఏషియ న్యూస్:  పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

పనిచేయకపోతే తొలగిస్తాం: ఎఫ్ఆర్టీఐ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్

నరసరావుపేట,ఐఏషియ న్యూస్:  ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో పని చేయని వారిని పదవుల నుంచి తొలగిస్తామని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్ స్పష్టం చేశారు.జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ సూచనల మేరకు ఎఫ్ఆర్టీఐ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా పని చేస్తామని పదవులు తీసుకొని పని చేయని వారు పదవులలో నుండి వైదొలగి కార్యకర్తగా కొనసాగవచ్చన్నారు.సీనియర్ నేత నెల్లూరుకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లా శ్రీవాసరావు, బాపట్లకు చెందిన శామ్యూల్ జాన్సన్ నాయకత్వం నుంచి తప్పుకొని సాదారణ కార్యకర్తగా స్వచ్ఛందంగా …

Read More »

9వ జాతీయస్థాయి పికిల్ బాల్ పోటీ జట్టుకు సుజయ్ కృష్ణ రంగారావు నాయకత్వం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  జమ్మూలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న తొమ్మిదవ జాతీయ స్థాయి పికిల్ బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు బయలుదేరింది. మాజీ మంత్రి,ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.గత నెల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సుజయ్ కృష్ణ రంగారావు పురుషుల విభాగంలోను అటు 50+ డబుల్స్ లో విజేతగా నిలిచి, జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ఆయనతో పాటు బొబ్బిలికి చెందిన బదరి రావు …

Read More »

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల బోనస్‌ ప్రకటించిన కేంద్రం. బోనస్‌ కోసం రూ.1866 కోట్లు కేటాయింపు. గ్రూప్‌-సి, గ్రూప్‌-డి కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం. 30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం.దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు. సి ఎస్ ఎస్ పథకం-3 కింద 5,000 …

Read More »

అంగన్వాడి,ఆశ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు: ప్రభుత్వం నిర్ణయం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు.ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.కాగా ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో తల్లికి …

Read More »

డ్యూటీ లోనే గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

పెందుర్తి,ఐఏషియ న్యూస్: గుండెపోటుతో ఎస్.కోట ఏపీఎస్ఆర్టీ సీ డిపోకు చెందిన కండక్టర్ మంగళవారం మృతి చెందారు. ఎస్. కోట ఏపీఎస్ఆర్టీ డిపో సూపరిండెంట్ వెంకట్రావు తెలియజేసిన వివరాలు ప్రకారం విశాఖ నుంచి కించుమండ వెళుతున్న బస్సులో పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ సమీపంలో కండక్టర్ ఈశ్వరరావు తాను కూర్చున్న సీటులోనే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన ప్రయాణికులు,డ్రైవర్ కండక్టర్ ఈశ్వరరావును పెందుర్తి ఆరోగ్య కేంద్రానికి  తరలించగా  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషాద ఛాయలు అలముకొన్నాయి. Authored by: Vaddadi udayakumar  

Read More »

ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి

సిజేరియన్ ఆపరేషన్లు ఆందోళన కలిగిస్తోంది సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు హెచ్చరిక ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.అలాగే ఏపీలో సిజేరియన్‌ ఆపరేషన్లు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వాటిలో 90 శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ధోరణిని ఏమాత్రం ఆమోదించదని హెచ్చరించారు.సహజ …

Read More »

శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

విజయనగరం,ఐఏషియ న్యూస్: విజయనగరం పట్టణంలో అక్టోబరు 6, 7 తేదీల్లో జరగబోయే శ్రీ పైడితల్లి అమ్మవారి తోలెళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో క్యూలైన్ల ఏర్పాటు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి,, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి, జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంకు చేరుకొని, ముందుగా అమ్మవారిని దర్శించుకొని, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేయుచున్న క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం, ఆలయం పరిసర …

Read More »

ఏపీలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలి

నాగబాబు ప్రశ్నలకు హోం మంత్రి సమాధానం  అమరావతి,ఐఏషియ న్యూస్: మొదటిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు,మొదట్లో కొంత సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈరోజు ఆయన చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. కూటమి ,వైఎస్సార్‌సీపీ సభ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న తర్వాత,2019-24 కాలంలో తప్పుడు అక్రమ క్రిమినల్ కేసుల పరిష్కారంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు కేసుల గురించి ఆయన గణాంకాలతో సహా సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు …

Read More »

నేడు 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారంపశ్చిమగోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో వివిధ కార్యక్రమాలకు కోసం పర్యటించనున్నారు.  వివరాల్లోకి వెళితే పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు అలాగే విజయవాడ విజయవాడ ఉత్సవాల్లో పాల్గొనడానికి రానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు చంద్రబాబు స్వాగతం పలుకుతారు.అంతేకాకుండా తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సీఎం చంద్రబాబు సమర్పించనున్నారు. గురువారం తిరుమలలో ఏ ఐ ఆథారిత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌,శ్రీవారి ప్రసాదాలకు మిషన్ ప్లాంట్ లను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. Authored by: Vaddadi udayakumar

Read More »