అమరావతి చాన్విక జ్యోతిన్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. దుర్గగుడి ఆలయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై విపక్ష వైసీపీ నేతలు, కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తోసిపుచ్చి.. “విజయవాడ ఉత్సవ్”ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా మొదట హైకోర్టు సింగిల్ బెంచ్, ఆలయ భూముల్లో వ్యాపార సంబంధిత కార్యక్రమాలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని …
Read More »admin
గిరిజన జనాభా 50శాతం కంటే ఎక్కువ ఉన్న ఏరియాలను షెడ్యూల్ ఏరియాగా ప్రకటిస్తాం
మాడుగుల ఎమ్మెల్యే బండారు ప్రశ్నకు స్పందించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రం గిరిజన జనాభా 50శాతం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రకటించేందుకు 496 గ్రామాలపై ప్రతిపాదన సిద్ధమై పరిశీలనలో ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. శాసనసభలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు.అనకాపల్లి జిల్లా మాడుగుల …
Read More »భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దుర్గా నవరాత్రి ఉత్సవాలు
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాలు పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వస్తున్నారు. ప్రతీ ప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. విజయవాడలో బాలత్రిపురసుందరి దర్శనం అలంపురి శక్తిపీఠాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తొలిరోజు అమ్మవారు బాలత్రిపురసుందరిగా దర్శనమిస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులనుదర్శనానికి అనుమతించారు. మంగళవారం నుండి ఉదయం 4 …
Read More »సీనియర్ సిటిజన్,దివ్యాంగ భక్తులకోసం రెండు వీల్ చైర్స్ వితరణ చేసిన న్యాయవాది రహీమున్నీసా
సింహాచలం,,ఐఏషియ న్యూస్: సింహాచలం దేవస్థానానికి వచ్చే సీనియర్ సిటిజన్, దివ్యాంగ భక్తుల కోసం విశాఖ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రహీమున్నీసా తన తండ్రి షేక్ ఖాదర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆలయ అధికారి సునీల్ కు రెండు వీల్ చైర్స్ అందజేశారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రహీమున్నీసా తెలియజేశారు.అనంతరం సింహాద్రి నాధుని దర్శించుకున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »జియో పేమెంట్స్ బ్యాంక్ 6.5శాతం వడ్డీ రేటుతో
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్‌సీఎల్) అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్, సరికొత్త ‘సేవింగ్స్ ప్రో’ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ఖాతాల్లోని అదనపు నిధులపై వినియోగదారులకు 6.5 శాతం వరకు వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో రూ.5000 నుంచి కనీస మొత్తాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొత్తానికి అదనంగా ఉండే సొమ్మును ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెడతారు. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు రోజుకు రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో …
Read More »ఏపీకి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రాక రేపు
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతిగా తొలిసారి బుధవారం రాష్ట్రానికి వస్తున్న రాధాకృష్ణన్.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి పర్యటన సంబంధించి జిల్లా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ప్రసారభారతి మాజీ సీఈవో కె.ఎస్.శర్మ అనారోగ్యంతో మృతి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రసారభారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (కె ఎస్ శర్మ)(80) శనివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్ క్యాడర్1968 ఐఏఎస్ అధికారి అయిన కె ఎస్ శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా కొద్ది కాలం,ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓ గా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టటంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకలెక్టర్ గా విశేష సేవలు అందించారు. …
Read More »969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి రికార్డ్ సృష్టించిన రష్యా రైతు
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రష్యా రైతు అలెగ్జాండర్ చుసోవ్ అరుదైన ఘనత సాధించారు. ఏకంగా 969 కిలోల బరువున్న భారీ గుమ్మడికాయను పండించి కొత్త రికార్డు సృష్టించారు. ఈ గుమ్మడికాయను మాస్కోలో జరిగిన అతిపెద్ద కూరగాయల పోటీలో ప్రదర్శించారు. రష్యా చరిత్రలో ఇంత పెద్ద గుమ్మడికాయ మొదటిసారి నమోదు కావడం విశేషం. ఆరు నెలల శ్రమ ఫలితం ఈ భారీ గుమ్మడికాయను పెంచడానికి చుసోవ్ దాదాపు ఆరు నెలలకు పైగా కృషి చేసినట్టు తెలిపారు. గుమ్మడికాయ పెరుగుదలకు అనువైన వాతావరణం కోసం ప్రత్యేకంగా గ్రీన్‌హౌస్ …
Read More »ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పనిగంటలు పెంపునకు ప్రభుత్వ ఆమోదం
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో దుకాణాలు,సంస్థల్లో పని గంటల పెంపునకు ఆమోదం లభించింది. ప్రస్తుతం 8 పని గంటల విధానం ఇక నుంచి మరో రెండు గంటల వరకు పెరగనుంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లోనూ మహిళలను రాత్రిపూట విధులకు అనుమతిస్తారు. పనిగంటల పెంపు సమయంలో పలు నిబంధనలను స్పష్టం చేసారు. దీని ద్వారా రాష్ట్రంలోని దుకాణాలు.. సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఇక పని గంటలు పెరగనున్నాయి.ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025 …
Read More »హెచ్ వన్ బి వీసా విషయంలో ట్రంప్ నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం
హైదరాబాద్ ,ఐఏషియ న్యూస్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న …
Read More »
News Website (iasianews.net) I Asia News