హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో గల హుకుంపేట గ్రామంలో నిర్మాణ దశలో ఆగిపోయి ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాల భవనం పూర్తి చేయాలని సర్పంచ్ పూర్ణిమను ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ కోరారు. సర్పంచ్ పూర్ణిమ ఇదే విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజకి శుక్రవారంవినతి పత్రం అందజేయడం జరిగింది.హుకుంపేట గ్రామంలో గల పాఠశాలకు సొంత భవనం లేక మరొక పాఠశాల హై స్కూల్, భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని,ఇటీవలే భారీ వర్షాలు కారణంగా ప్రస్తుతం ఉన్న భవనంలో భారీ వృక్షం పడడం వలన భవనం శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతం 2025 వ సంవత్సరం నుంచి పాఠశాలకు మోడల్ ప్రైమరీ పాఠశాలగా చేసి ఉన్నారని, ప్రస్తుతం పాఠశాలలో 66 మంది విద్యార్థులు విద్యను అభసిస్తున్నారని,నిబంధన ప్రకారం తరగతికి ఒకరు చొప్పున మొత్తం 5 గురు ఉపాధ్యాయులను నియమించి ఉన్నారని, ప్రస్తుతం 1 నుండి 5 వ తరగతి వరకు ఒకే భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారని,ఈ స్కూల్ కు ఇంతకు ముందు నిర్మాణం పనులను ప్రారంభించినప్పటికీ అది మధ్యలోనె పిల్లర్స్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోయింది. అందుచేత హుకుంపేట గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ని పూర్తి చేయాల్సిందిగా ప్రాజెక్ట్ అధికారిని సర్పంచ్ పూర్ణిమ కోరారు దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు.తక్షణమే స్కూల్ భవనం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News