విశాఖలో భారత్ ఘన విజయం..సౌత్ ఆఫ్రికాపై సిరీస్ కైవసం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా పై ఇండియా భారీ ఘన విజయం సాధించింది.దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా ఇండియా మరో 61 బాల్స్ ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్ (116) తొలి వికెట్ కు 155 పరుగులు భాగస్వామ్యం జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి(65)తో కలిసి జైస్వాల్ ఇండియా కు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేజెక్కించుకుంది. సిటీ కమీషనర్ డాక్టర్ శంకభ్రత భాగ్చి ఆధ్వర్యంలో ఎటువంటి అంతరాయం కలగకుండా మ్యాచ్ ని పటిష్ట భద్రతతో ఎటువంటి అంతరాయం కలగకుండా జరిపిన సిటీ పోలీస్ కమీషనర్ కి విశాఖ ప్రజలు, సంబంధించిన అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్ విద్యార్థిని పి కరుణ ప్రపంచ క్రికెట్ కప్‌లో ఎంపిక 

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నగర పరిధిలోగల సాగర్ నగర్‌లోని గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కుమారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *