శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానానికి హుండీల ద్వారా 67 లక్షల ఆదాయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 40 రోజులకుసంబంధించి హుండీలలో వచ్చిన నగదు,బంగారం, వెండి మొదలగు కానుకలు సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా ద్వారా 67,78,784 రూపాయల ఆదాయం లభించిందని ఈవో శోభారాణి తెలియజేశారు.నగదుతోపాటు బంగారం వెండి కూడా భక్తులు సమర్పించారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉపకమీషనరు, కార్యనిర్వాహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీమతి టి. అన్నపూర్ణ, 2/3 3 ఇన్స్పెక్టర్, దేవదాయశాఖ, విశాఖపట్నం, ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికార్లు ఎన్. ఆనంద్ కుమార్, కె. రాజేంద్రకుమార్,పర్యవేక్షకులు ఎస్. కనక రాజు, శ్రీమతి కె. పద్మజ,శ్రీ డి. రాజు, మేనేజర్, యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, శ్రీ హరి సేవ, గోపాలపట్నం సభ్యులు,దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయం
మార్గశిరమాస ఉత్సవాలు సందర్భంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని సోమవారం వేలాది మంది భక్తులు దర్శించుకుని స్వయంగా క్షీర, నారికేళ గంగాజల అభిషేకాలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో శోభారాణి భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *