సింహాచల అన్నదాన పథకానికి రూ. 1.16 లక్షల విరాళం

సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సింహద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి గురువారం విరాళం అందజేశారు.విశాఖపట్నం, శివశక్తినగర్ (శివాజీపాలెం) ప్రాంతానికి చెందిన భక్తులు కాశిన వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యుల పేరున 1,00,116 రూపాయల విరాళాన్ని అందజేశారు.దాతలు తొలుత దేవస్థాన ప్రోటోకాల్ కార్యాలయంలోని డొనేషన్ కౌంటర్ వద్ద నగదును చెల్లించి రసీదు పొందారు.ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు సూర్యనారాయణ దాతలకు పథకానికి సంబంధించిన అధికారిక బాండ్‌ను అందజేశారు.అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, ఆలయ పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ప్రతి ఏటా అక్టోబర్ 16వ తేదీన దాత కోరుకున్న విధంగా ఈ విరాళంపై వచ్చే వడ్డీతో అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *