దుబాయ్,ఐఏషియ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు అబుదాబిలో పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి నిర్వహించిన వన్-టూ-వన్ సమావేశాలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైనవిగా మారాయి. ప్రధానంగా ఎనర్జీ రంగంపై ఫోకస్ విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ రంగంలో పెట్టుబడుల కోసం అపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఛైర్మన్ ఖలీఫా ఖౌరీ, మస్దార్ సీఈఓ మొహమ్మద్ …
Read More »finance
ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ఆసుపత్రులకు 250 కోట్లు బకాయిలు విడుదల
విజయవాడ,ఐఏషియ న్యూస్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. నిధుల చెల్లింపులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో చర్చించారు. అనంతరం చర్యల్లో భాగంగా నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అలాగే త్వరలో మరో రూ.250 కోట్లను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు.రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వైద్య సేవల్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ …
Read More »ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం: బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాజధాని దిల్లీ శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సుమారు 1:20 గంటల ప్రాంతంలో దిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. తక్షణమే స్పందించిన అధికారులు దాదాపు 14 …
Read More »డేటా సెంటర్ లో ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి
డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాము వాటికి సమాధానం చెప్పలేక నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు గుగూల్‌తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై తాను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ …
Read More »లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ అధికారి
నల్లగొండ జిల్లా,ఐఏషియ న్యూస్: బాణసంచా దుకాణం నడపడానికి తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుడి నుండి 8వేల రూపాయలు లంచం తీసుకున్న ఘటన గురువారం జరిగింది.ఈ ఘటనలో నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి ఎ. సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు తాత్కాలిక లైసెన్స్ కోసం ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (నాక్) పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ ప్రక్రియను వేగవంతం చేయాలంటే రూ.8,000/- లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు …
Read More »డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో ఎంతో అభివృద్ధి
కర్నూల్లో సూపర్ జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలులో గురువారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉందని, తాను అక్కడే పుట్టానని మోడీ గుర్తుచేసుకున్నారు. రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి …
Read More »50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసిల్దార్ అశోక్ ప్రసాద్
కార్యాలయంలో ఉన్న 5 లక్షల 88వేలు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు అమలాపురం,ఐఏషియ న్యూస్: డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంపై బుధవారం ఏసిబి దాడులు నిర్వహించారు.ఏసిబి డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.రాజోలు గ్రామానికి చెందిన గంధం దుర్గ కొండలరావు భూమిని సర్వే చేసేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ లక్ష రూపాయలు డిమాండ్ చేయగా డిజిటల్ అసిస్టెంట్ రాము ద్వారా 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం చేసుకున్న మేరకు 50 వేలు బుధవారం లంచం తీసుకుంటూ ఉండగా …
Read More »పంట నీటమునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఇటీవల వర్షాల కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5,250 ఎకరాలు పంటలు నీటమునిగి నష్టపోయినందున రైతులకు నష్ట పరిహారం అందించాలని, టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రెండు సంవత్సరాలకు గాను రూ.40 వేలు చెల్లించాలని,నియోజకవర్గంలో పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి, నాయకులు,రైతులతో కలసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ …
Read More »నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుల బంద్
బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు చేస్తాం అన్న ప్రైవేటు హాస్పిటల్ సంఘం 2,700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్: ఏపీలో శుక్రవారం నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారికి చుక్కలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వాడుకునేందుకు వీల్లేగుండా ప్రైవేటు ఆస్పత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ సేవల్ని నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో రోగులు తమ సొంత డబ్బులు పెట్టి మరీ వైద్యం చేయించుకోక తప్పని పరిస్ధితులు …
Read More »2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసిల్దార్
చిట్యాల (నల్లగొండ),ఐఏషియ న్యూస్: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ గుగులోతు కృష్ణ లంచం తీసుకుంటూ గురువారం తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి గట్టు రమేష్ కూడా అరెస్టయ్యారు. ఈ సంఘటనపై ఏసీబీ అధికారులు తెలియజేసిన వాళ్ళు ఈ విధంగా ఉన్నాయి మెసర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడం, అలాగే మరో వ్యవసాయ భూమి సర్వే నివేదికను చిట్యాల రక్షక భట నిలయ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించడం కోసం ఫిర్యాదుదారుని …
Read More »
News Website (iasianews.net) I Asia News