కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు ప్రాణాలు …
Read More »Uncategorized
స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు
,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా రూరల్ మండలంలోని వేదాంతపురం సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం అగ్రహారం గ్రామానికి చెందిన 7 మంది యువకులు నదిలో ఈత కొడుతుండగా ప్రమాదం జరిగిందని,ఇసుక దిబ్బలపై ఆడుతూ స్నానం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారని తెలిపారు. ముగ్గురు మాత్రం స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత శాఖలకు అప్రమత్తం అవ్వాలని, గల్లంతైన విద్యార్థుల కోసం …
Read More »పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్: 19.20 లక్షల నగదు స్వాధీనం
పరవాడ,ఐఏషియ న్యూస్: పెదముషిడివాడ శివారులోని నక్కవా నిపాలెం పొలిమేరలో ఈ నెల 21న పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.19.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ తెలిపారు.ఈ సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పేకాట వివరాలు తెలియజేశారు. నక్కవానిపాలెం గ్రామ పొలిమేరల్లో ఒక రహస్య ప్రదేశంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ఆర్.మల్లి కార్జునరావు తన సిబ్బందితో కలిసి …
Read More »ఎంవీపీలో దొంగనోట్ల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలో గల ఎంవీపీలో చోటు చేసుకుంది. ఈజీమనీ కోసం కొంతమంది కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దొంగనోట్లు ముద్రించి ప్రజల్లో చలామణికి పాల్పడుతున్నారు. . దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీపీ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఓ వ్యక్తి తన ఇంట్లోనే దొంగనోట్లు తయారు …
Read More »ఐస్ల్యాండ్ లో తొలిసారిగా కనిపించిన దోమ
ఐస్ల్యాండ్,ఐఏషియ న్యూస్: ప్రపంచంలోనే దోమలు లేని దేశంగా పేరుగాంచిన ఐస్ల్యాండ్లో తొలిసారిగా దోమలు కనిపించాయి. వెస్ట్రన్ ఐస్ల్యాండ్లోని ఓ అడవిలో వీటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా తెలిపారు. ఇదివరకు విమానంలో ఒక దోమను గుర్తించినా, ఇప్పుడు సహజ వాతావరణంలో కనుగొనడం ఇదే తొలిసారి.వాతావరణ మార్పుల కారణంగానే ఈ కీటకాలు ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఈ దోమల ఆగమనం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయనడానికి సంకేతం.దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. Authored by: Vaddadi udayakumar
Read More »రాష్ట్రంలో కొత్తగా ఏడు డయాలసిస్ కేంద్రాలు: పీపీపీ విధానంలో నిర్వహణ
అమరావతి,ఐఏషియ న్యూస్: ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట,విజయనగరం జిల్లా ఎస్. కోట,పశ్చిమగోదావరి జిల్లా భీమవరం,బాపట్ల జిల్లా అద్దంకి,నంద్యాల జిల్లా సున్నిపెంట,చిత్తూరు జిల్లా పీలేరు,శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు,ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని మంత్రి …
Read More »పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం చంద్రబాబు
మంగళగిరి,ఐఏషియ న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని 6వ బెటాలియన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు: సీఎం చంద్రబాబు ప్రకటన
మంగళగిరి,ఐఏషియ న్యూస్: సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు.ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను సిబ్బందిని సీఎం చంద్రబాబు అభినందించారు. Authored by: Vaddadi udayakumar
Read More »దేశంలోనే అత్యుత్తమ స్థానంలో తెలంగాణ పోలీస్ నిలవాలి
పోలీస్ అమరవీరుల దినోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత, శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు.“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర …
Read More »ఏపీలో విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం:సమ్మె విరమణ
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలోవిద్యుత్,ఉద్యోగులసమస్యలపైయాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి.దాదాపు 12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీ వేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.అయితే కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్,వారికి నేరుగా జీతం చెల్లింపుపై మాత్రం అంగీకారం తెలపలేదు.చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News