డల్లాస్,ఐఏషియ న్యూస్: మెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. డల్లాస్ లోని ఓ పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న విద్యార్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే ఘటనపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. విద్యార్థి పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమెరికాలోని డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థి మృతి చెందాడు. పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అయితే అక్టోబర్ 4 ఉదయం డల్లాస్ లో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే తాజాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్ కు చెందిన విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నాప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతికకాయాన్నిస్వస్థలానికితీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం” అని స్పష్టం చేశారు. ఇదేఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు వనస్థలిపురంలోని టీచర్స్ కాలనీలో ఉన్న చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా తక్షణమే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Authored by: Vaddadi udayakumar