Recent Posts

కోనసీమ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన పులిమచ్చల చేప

అంతర్వేది,ఐఏషియ న్యూస్: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద మత్స్యకారుల వలకు అరుదైన పులిమచ్చల టేకుచేప చిక్కింది.10-12 కిలోల బరువున్న ఈ చేప పొట్టలోని బ్లాడర్ ఔషధ తయారీలో ఉపయోగపడుతుంది. సాధారణంగా అరుదుగా లభించే ఈ చేపకు అక్వేరియం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.ప్రోటీన్ అధికంగా ఉండటంతో కండరాల పెరుగుదలకు,గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమని వైద్యులు తెలిపారు. Authored by: Vaddadi udayakumar

Read More »

19న వైయస్సార్‌సీపీ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

అమరావతి,ఐఏషియ న్యూస్: తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ కేంద్ర కమిటీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కేంద్రం పలు రాష్ట్రాలకు యూరియాను కేటాయించిన సందర్భంగా రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తూ 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని మంత్రి అన్నారు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మ్యాంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 …

Read More »