శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌లోని కీలక శాఖలు, వెబ్‌సైట్‌లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లలో పెన్‌డ్రైవ్‌లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ మెసేజింగ్ సర్వీస్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. డేటా చోరీ జరుగుతోందన్న ఆందోళనల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇక కొన్ని నెలల క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌పై సైబర్ దాడులు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం సైబర్ వలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News