ఆసీస్‌ను చిత్తుచేసిన భారత్‌

క్వీన్‌లాండ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30)టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్‌ 3, అక్షర్‌ 2, శివమ్‌ 2 వికెట్లు తీశారు.అర్ష్‌దీప్‌, బుమ్రా, వరుణ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.భారత జట్టుకు పలువురు అభినందనలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఆరిలోవ దోపిడీ కేసు ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల14న రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *