అన్నవరం,ఐఏషియ న్యూస్: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి చెందిన శ్రీ సత్యదేవ నిత్య అన్నదాన ట్రస్ట్ కు శనివారం భక్తులు అల్లూరి సూర్యనారాయణ రాజు, శ్రీమతి సూర్యచంద్ర కాంతం పేరుమీదుగా 1,00,000 రూపాయలు విరాళముగా అందజేశారు.ఈ విరాళమును ప్రతీసంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహణ కోసం భక్తి శ్రద్ధలతో సమర్పించారని దేవస్థాన అధికారులు తెలిపారు.భక్తుల సేవా భావం, సమర్పణ భావనకు దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేసింది.శ్రీ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News