ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధిరకు చెందిన భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి అతడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు, ఇతర ఖర్చుల కోసం రూ.1.30 లక్షలు వస్తాయి. ఆ డబ్బుల కోసం మృతుడి కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు.ఈ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, రూ.1.30 లక్షలు మంజూరు చేయడానికి జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమచారం ఇచ్చాడు.ఈ మేరకు సోమవారం లంచం తీసుకుంటుండగా సహాయ కార్మిక శాఖ అధికారి చందర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అనంతరం అనంతరం అతడిపై కేసు నమోదు చేసి
ఏసీబీ కోర్టుకీ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News