దిత్వా తుపాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం

  • హోమ్ విపత్తుల నివారణ శాఖామంత్రి వంగలపూడి అనిత
  • మత్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరిక

అమరావతి ,ఐఏషియ న్యూస్: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి కారైకల్ కి 120 కి.మీ., పుదుచ్చేరికి 220 కి.మీ., చెన్నైకి 330 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు.తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు శనివారం అర్ధరాత్రి నాటికి 60 కి.మీ, ఆదివారం ఉదయానికి 50 కి.మీ, సాయంత్రానికి 25 కి.మీ కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని వివరించారు.మత్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.దిత్వా తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని హోం శాఖ విపత్తుల నివారణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండలస్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చామన్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ వివరాలు
దిత్వా తుఫాన్‌తో కడప జిల్లా యంత్రాంగం అప్రమత్తం, కడప కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్: 08562-246344,కడప ఆర్డీవో ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్: 08562-295990జమ్మలమడుగు, ఆర్డీవో ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్: 9502836762,బద్వేలు ఆర్డిఓ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్: 6301432849,పులివెందుల ఆర్డీవో ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్: 9849904111,అన్నమయ్య కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్: 08561-293006.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మంత తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అప్రమత్త చర్యలు

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *